కర్నూలు జిల్లా వెల్దుర్తి వద్ద జరిగిన రోడ్డు ప్రమాద మృతదేహాలకు కర్నూలు పెద్దాసుపత్రిలో శవపరీక్షలు నిర్వహించి... గద్వాల జిల్లా రామాపురానికి అధికారులు తరలించారు.. మార్గ మద్యలో శాంతినగర్ వద్ద మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్, మందకృష్ణ మాదిగ బైఠాయించి మృతదేహాలు తరలింపును అడ్డుకున్నారు. మృతులు కుటుంబాలకు నష్ట పరిహారం చెల్లించి తగిన న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. చుట్టు పక్కల గ్రామాలకు చెందిన ప్రజలు ఈ నిరసనలో పాల్గొని న్యాయం చేయాలని కోరారు. రోడ్డుపై బైఠాయింపుతో రాకపోకలు పూర్తిగా స్థంభించిపోయాయి.
చర్చలు జరిపిన అధికారులు