ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

శ్రీశైలంలో నేడు సంక్రాంతి బ్రహ్మోత్సవాలు ప్రారంభం - Srisailam Sankranti Brahmotsavalu news

నేడు శ్రీశైలంలో సంక్రాంతి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఇవాల్టి నుంచి 17వ తేదీ వరకు కార్యక్రమాలు నిర్వహించనున్నారు.

Sankranti Brahmotsavalu begins today in Srisailam
శ్రీశైలంలో నేడు సంక్రాంతి బ్రహ్మోత్సవాలు ప్రారంభం

By

Published : Jan 11, 2021, 8:50 AM IST

సంక్రాంతి బ్రహ్మోత్సవాలకు శ్రీశైల మహాక్షేత్రం ముస్తాబైంది. నేటి నుంచి 17వ తేదీ వరకు ఈ బ్రహ్మోత్సవాలు జరుగనున్నాయి. శ్రీభ్రమరాంబ మల్లికార్జున స్వామి వార్ల ఆలయాన్ని రంగు రంగుల విద్యుత్ దీపాలతో అలంకరించారు. ఆలయ ప్రవేశంలో స్వాగత తోరణాలు ఏర్పాటు చేశారు. ఉదయం 8.30 గంటలకు దేవస్థానం ఈవో కె.ఎస్.రామారావు, అర్చకులు, వేదపండితులు యాగశాల ప్రవేశం చేసి.. బ్రహ్మోత్సవాలకు ప్రారంభ పూజలు నిర్వహిస్తారు.

సాయంత్రం 7 గంటలకు ఆలయ ప్రాంగణంలో అంకురార్పణ, అగ్ని ప్రతిష్టాపన పూజలు చేసి సకల దేవతలను ఆహ్వానిస్తూ ధ్వజారోహణం, ధ్వజ పటావిష్కరణ జరుపనున్నారు. బహ్మోత్సవాల సందర్భంగా సోమవారం నుంచి ఆర్జిత రుద్రచండీ మృత్యుంజయ హోమాలు, స్వామి అమ్మవార్ల కల్యాణం, ఏకాంత సేవలను నిలిపేశారు.

ABOUT THE AUTHOR

...view details