శ్రీశైల మహా క్షేత్రంలో సంక్రాంతి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. మూడో రోజు శ్రీ పార్వతి సమేత మల్లికార్జున స్వామి రావణ వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయ ప్రాంగణంలో స్వామి అమ్మవార్లకు అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించి గ్రామోత్సవానికి తీసుకువచ్చారు. కళాకారులు చేసిన ఢమరుక నాదాలు, కోలాటాలతో భక్తులను ఆకట్టుకున్నారు. శివనామ స్మరణతో శ్రీగిరి పుర వీధుల్లో స్వామివార్లకు శోభాయమానంగా గ్రామోత్సవం నిర్వహించారు.