కర్నూలు జిల్లా గూడూరు మండల పరిధిలో అక్రమంగా ఇసుక తరలిస్తున్న 5 టిప్పర్లను పోలీసులు సీజ్ చేశారు. తుంగభద్ర నది నుంచి ఇసుకను తవ్వి గూడూరు సమీపంలో డంప్ చేస్తున్నట్లు సమాచారం అందిన మేరకు దాడులు నిర్వహించారు.
కౌషిక్ కుమార్ రెడ్డి అనే వ్యక్తిపై కేసు నమోదు చేసి 5 వాహనాలు స్వాధీనం చేసుకున్నట్లు కోడుమూరు సీఐ పార్థసారథి తెలిపారు. ఇలాంటి వ్యవహారాలను సహించేది లేదని చెప్పారు.