కర్నూలు జిల్లా నంద్యాల మండలం పాండురంగాపురంలో జిల్లాస్థాయి రైతు భరోసా కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి గుమ్మనూరు జయరాం, ఎంపీ పోచా బ్రహ్మానందరెడ్డి, ఎమ్మెల్యేలు శిల్పారవిచంద్ర కిషోర్ రెడ్డి, చక్రపాణి రెడ్డి, గంగుల బిజేంద్రనాథ్ రెడ్డి, కాటసాని రాంభూపాల్ రెడ్డి, కలెక్టర్ వీరపాండియన్ తదితరులు పాల్గొన్నారు. జిల్లాలో 200 కోట్ల రూపాయలతో ఉపాధి హామీ పథకం కింద రైతు భరోసా కేంద్రాలకు భవనాలు నిర్మిస్తామని కలెక్టర్ తెలిపారు. ఎరువులు, విత్తనాలు గ్రామంలో లభించడం ఆనందంగా ఉందన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంపై ప్రజలు సంతోషంగా ఉన్నారని మంత్రి జయరాం తెలిపారు.
పాండురంగాపురంలో రైతు భరోసా కేంద్రం ఏర్పాటు - rythu bharosa centre started in nandyal latest news
పాండురంగాపురంలో జిల్లాస్థాయి రైతు భరోసా కేంద్రాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమంలో కలెక్టర్, ఎమ్మెల్యే చంద్రకిషోర్ రెడ్డి, ఎంపీ బ్రహ్మానందరెడ్డి, మంత్రి జయరాం పాల్గొన్నారు. వివిధ శాఖలు ఏర్పాటు చేసిన ప్రదర్శనలను మంత్రి, ఎమ్మెల్యేలు తిలకించారు.
పాండురంగాపురంలో రైతు భరోసా కేంద్రం ఏర్పాటు