నంద్యాలలో ఎన్.ఎమ్.యూ నేతల నిరాహార దీక్ష - samme
కర్నూలు జిల్లా నంద్యాలలో నేషనల్ మజ్దూర్ యూనియన్ నాయకులు నిరాహారదీక్ష చేపట్టారు. డిమాండ్లను పరిష్కరించకుంటే ఆర్టీసీ సమ్మె తప్పదని తెలిపారు.
'నంద్యాలలో ఎన్.ఎమ్.యూ నేతల నిరాహార దీక్ష'
సమస్యలు పరిష్కరించాలంటూ... కర్నూలు జిల్లా నంద్యాలలో నేషనల్ మజ్దూర్ యూనియన్ నాయకులు నిరాహార దీక్షకు దిగారు. ఆర్టీసీలో సిబ్బంది కుదింపు, పనిభారం, ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం వంటి పలు డిమాండ్లను నెరవేర్చాలన్నారు. లేని పక్షంలో ఈ నెల 13 నుంచి సమ్మె చేస్తామని హెచ్చరించారు.