ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

దయనీయ పరిస్థితుల్లో ఆర్టీసీ అద్దె బస్సుల యజమానులు - కర్నూలు జిల్లా వార్తలు

ఆర్టీసీలో అద్దె బస్సులు తిరగక తాము... తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని యజమానులు వాపోయారు. ఎనిమిది నెలలుగా ఆదాయం లేక ఆర్థిక సవాళ్లు ఎదుర్కొంటున్నామని ఆందోళన చేశారు.

RTC rent bus owners protest in gudur kurnool district
దయనీయ పరిస్థితుల్లో ఆర్టీసీ అద్దె బస్సుల యజమానులు

By

Published : Sep 28, 2020, 10:37 PM IST

ఎనిమిది నెలలుగా ఆర్టీసీలో అద్దె బస్సులు తిరగకపోవడంతో.. అప్పుల ఊబిలోకి కూరుకుపోయామని బస్సుల యజమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సమస్య ఇలాగే కొనసాగితే తమ కుటుంబాలు రోడ్డున పడాల్సి వస్తుందని వాపోయారు.

లాక్​డౌన్‌తో ఎక్కడికక్కడ బస్సులు నిలిచిపోవటంతో టైర్లు, బ్యాటరీలు పాడైపోయాయని అన్నారు. వచ్చే ఏడాదికైనా బీమా వర్తించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రభుత్వం స్పందించకపోతే బస్సులను అమ్ముకోవాల్సిన పరిస్థితి వస్తుందన్నారు.

ABOUT THE AUTHOR

...view details