TSRTC Special Buses for Sankranti: తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థకు సంక్రాంతి ఎంతో కీలకమని, అందుకు అధికారులంతా పూర్తిగా సన్నద్ధంకావాలని ఆ సంస్థ ఎండీ సజ్జనార్ సూచించారు. ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. రద్దీ ప్రాంతాల్లో డిపో మేనేజర్, ఆపై అధికారులు ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షించాలని సంక్రాంతికి ప్రత్యేక బస్సుల ఏర్పాటుపై నిర్వహించిన సమీక్షలో స్పష్టం చేశారు.
రాష్ట్రంలోని అన్ని ప్రధాన నగరాలు, పట్ణణాలకు ఆర్టీసీ ప్రత్యేక బస్సు సర్వీస్‌లను నడిపేలా చర్యలు తీసుకోవాలని సిబ్బందికి సూచించారు. రద్దీకి అనుగుణంగా సర్వీస్‌లు పెంచాలని ఆదేశించారు. హైదరాబాద్ ఎమ్జీబీఎస్లో కమాండ్ కంట్రోల్ సెంటర్ ఏర్పాటు చేయాలని దిశానిర్దేశం చేశారు. సంక్రాతికి రానుపోనూ ఒకేసారి ఆర్టీసీ బస్సులో, టికెట్ బుక్ చేసుకున్న వారికి తిరుగుప్రయాణంపై 10 శాతం రాయితీని కల్పిస్తున్నామని, ప్రజలు రాయితీని వినియోగించుకోవాలని సజ్జనార్ సూచించారు.