ఆర్టీసీ బస్సు టైర్ పంక్చరై.. పంట పొలాల్లోకి దూసుకుపోయింది. ఈ ఘటన కర్నూలు జిల్లాలో చోటుచేసుకుంది. కర్నూలు నుంచి వస్తున్న బస్సు దేవనకొండ మండలంలోని కొత్తపల్లి గ్రామ సమీపంలో టైర్ పంక్చరై ఒక్కసారిగా పంట పొలాల్లోకి వెళ్లింది. ఈ ఘటనతో ప్రయాణికులు భయాందోళనలకు గురయ్యారు. ప్రయాణ సమయంలో 35 మంది ప్రయాణికులు ఉన్నారు. ఎవరికి ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
పొలాల్లోకి దూసుకెళ్లిన బస్సు...తప్పిన ప్రమాదం - kurnool district latest news
కర్నూలు జిల్లాలో ఆర్టీసీ బస్సు పంక్చరై పంట పొలాల్లోకి దూసుకుపోయింది. ఈ ఘటనలో ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు.

పొలాల్లోకి దూసుకెళ్లిన బస్సు