Kurnool Accident: కర్నూలు జిల్లా సిరివెళ్ళ నుంచి రుద్రవరం వెళ్లే రహదారిలో రోడ్డు ప్రమాదం జరిగింది. చిన్నకంబలూరు మెట్ట సమీపాన ఆటోను ఆర్టీసీ బస్సు ఢీ కొనడంతో ఇద్దరు మహిళలు మృతి చెందారు. మరో తొమ్మిది మంది కి గాయాలయ్యాయి. రుద్రవరం మండలం చిన్నకంబలూరుకు చెందిన 15 మంది కూలీలు నంద్యాల మండలం మిట్నాలకు ఎండు మిర్చి కోసేందకు ఆటోలో వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. అక్కడికక్కడే మేరమ్మ, షిలాన్ బి అనే ఇద్దరు మహిళలు మృతి చెందారు. మరో తొమ్మిది మంది కూలీలు గాయపడ్డారు. గాయపడిన వారికి నంద్యాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
Accident: శిరివెళ్ల-రుద్రవరం రహదారిలో ఆటోను ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు.. ఇద్దరు మృతి - rtc bus auto accident at Sirivella-Rudravaram

accident
09:36 April 01
గాయపడిన వారిలో ఇద్దరి పరిస్థితి విషమం
Last Updated : Apr 1, 2022, 10:05 AM IST