కర్నూలు జిల్లా కొంగనపాడు వద్ద తెలంగాణ ఆర్టీసీ బస్సును లారీ ఢీకొట్టింది. ఐదుగురు ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. టీఎస్ఆర్టీసీ బస్సు హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. రోడ్డు నిర్మాణ పనుల్లో భాగంగా ఒకవైపు మాత్రమే వాహనాల రాకపోకలు కొనసాగుతున్న కారణంగా.. ప్రమాదం జరిగింది. బాధితులను చికిత్స నిమిత్తం కర్నూలు ఆసుపత్రికి తరలించారు.
తెలంగాణ ఆర్టీసీ బస్సుకు ప్రమాదం.. ఐదుగురు ప్రయాణికులకు గాయాలు - కర్నూలు జిల్లా నేర వార్తలు
కర్నూలు జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. తెలంగాణకు చెందిన ఆర్టీసీ బస్సును... లారీ ఢీకొట్టింది. ఈప్రమాదంలో ఐదుగురు ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు.
ఆర్టీసీ బస్సు- లారీ ఢీ: ఐదుగురికి గాయాలు