రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేశ్ జన్మదినం సందర్భంగా ఆయన ఇచ్చిన హామీలు నెరవేరుస్తున్నామని కర్నూలు తెదేపా సభ్యులు టీజీ భరత్ అన్నారు. రూ. 1కోటి 25 లక్షలతో కర్నూలు ఆసుపత్రికి ఆక్సిజన్ ప్లాంట్, అవసరమైన వైద్యపరికరాల అందజేత, కర్నూలు సమీపంలోని గ్రామాల్లో బావుల తవ్వకాలు చేయిస్తామని హామీ ఇచ్చారు.
అందులో భాగంగా 10 ఆక్సిజన్ కాన్సన్ ట్రేటర్లు, 5 మల్టీపారామీటర్లను ఆసుపత్రి పర్యవేక్షకుడు డా. నరేంద్రనాథ్ రెడ్డికి భరత్ అందజేశారు. త్వరలో ఆక్సిజన్ ప్లాంట్ ఏర్పాటు చేస్తామన్నారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వాళ్లకు ఉపయెగపడే వైద్య పరికరాలు అందజేయడం పట్ల డా. నరేంద్రనాథ్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు.