రౌడీ గ్యాంగ్ హల్చల్.. ఇనుప రాడ్లతో యువకుడిపై దాడి - రౌడీ గ్యాంగ్ హల్చల్..ఇనుప రాడ్లతో యువకుడిపై దాడి !
ఓ రౌడీ గ్యాంగ్ యువకుడిపై దాడికి పాల్పడిన ఘటన కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు పట్టణంలో జరిగింది. తమ గ్యాంగ్‌లో చేరనందుకు కక్ష పెంచుకొని తనపై ఇనుపరాడ్లతో దాడి చేశారని క్షతగాత్రుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
రౌడీ గ్యాంగ్ హల్చల్..ఇనుప రాడ్లతో యువకుడిపై దాడి !
కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు పట్టణంలో ఓ రౌడీ గ్యాంగ్ హల్చల్ చేసింది. యువకుడిపై ఇనుపరాడ్లతో తీవ్రంగా దాడి చేశారు. గాయపడ్డ వ్యక్తి తలకు తీవ్ర గాయాలు కావటంతో ప్రభుత్వాసుపత్రికి తరలించారు. తమ గ్యాంగ్‌లో చేరమని బలవంతం చేయగా... అందుకు అంగీకరించనందుకు తనపై దాడి చేసినట్లు క్షతగాత్రుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.