కర్నూలు జిల్లా మహానంది మండలం గాజులపల్లెలో ఓ ఎరువుల దుకాణంలో చోరీ జరిగింది. ఇద్దరు దొంగలు షాపు షట్టర్ పగలగొట్టి అందులో ఉన్న రూ. 20 వేల నగదు ఎత్తుకెళారు. అయితే చోరీ చేసిన దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డు అయ్యాయి.
బాధితుని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు స్థానిక పోలీసులు తెలిపారు. సీసీ దృశ్యాల ఆధారంగా దొంగలను గుర్తించే పనిలో పడ్డారు.