రహదారి భద్రతా వారోత్సవాలు సందర్భంగా కర్నూలు జిల్లా ఆళ్లగడ్డలో అవగాహన సదస్సు నిర్వహించారు. నంద్యాల ఆర్డవో కృష్ణారావు ఆధ్వర్యంలో కేవి సుబ్బారెడ్డి డిగ్రీ కళాశాలలో జరిపారు. రహదారి నిబంధనలు ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలన్నారు. వాహనాలు నడిపే సమయంలో సీటు బెల్టు ధరించి, చరవాణీలకు మాట్లాడేందుకు దూరంగా ఉండాలన్నారు. ఈ సందర్భంగా లక్ష్మీ ప్రసన్న అనే విద్యార్థిని మాట్లాడుతూ... మరో ఎనిమిది రోజుల్లో జర్మనీకి వెళ్లేందుకు సిద్ధంగా ఉన్న తన అన్న ట్రాక్టర్ ప్రమాదంలో ట్రాలీ కిందపడి తనువు చాలించాడని దుఃఖించింది. ఆ విషాదం నుంచి తమ కుటుంబం ఇంకా తేరుకోలేదన్నారు. సరదాగా గడపాల్సిన తమ కుటుంబం ఓ రహదారి ప్రమాదంతో తమ జీవితాలే మారిపోయాయని చెప్పటం అక్కడి వారిని కలచివేసింది.
రహదారి భద్రతావారోత్సవాల్లో కదిలించిన విద్యార్థి ప్రసంగం - రహదారి భద్రతా వారోత్సవాలు తాజా వార్తలు
కర్నూలు జిల్లా ఆళ్లగడ్డలో రహదారి భద్రతా వారోత్సవాలు సందర్భంగా అవగాహన సదస్సు నిర్వహించారు.
![రహదారి భద్రతావారోత్సవాల్లో కదిలించిన విద్యార్థి ప్రసంగం road safety week programme in kurnool district](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5774981-569-5774981-1579517603908.jpg)
కర్నూలు జిల్లాలో రహదారి భద్రతా వారోత్సవాలు
కర్నూలు జిల్లాలో రహదారి భద్రతా వారోత్సవాలు
ఇదీ చదవండి :