సీట్ బెల్టు, హెల్మెట్ పెట్టుకుంటేనే మంచిది! - అవగాహన ర్యాలీ
ట్రాఫిక్ నియమాలు పాటించడం వల్ల రోడ్డు ప్రమాదాలను అరికట్టవచ్చని సీఐడీ, డీఎస్పీ మహబుబ్ బాషా అన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణపై కిమ్స్ ఆసుపత్రి ఆధ్వర్యంలో కర్నూలులో అవగాహన ర్యాలీ నిర్వహించారు.
ROAD_SAFETY_RALLY_IN_KURNOOL
రోడ్డు ప్రమాదాల నివారణపై కిమ్స్ ఆసుపత్రి ఆధ్వర్యంలో కర్నూలులో నిర్వహించిన ర్యాలిని డిఎస్పీ మహబుబ్ బాషా ప్రారంభించారు. నగరంలోని రాజ్ విహర్ కూడలి నుండి కొండారెడ్డి బురుజు వరకు ప్రదర్శన కొనసాగింది. సీట్ బెట్టు, హెల్మెట్ పెట్టుకోవడం వల్ల ప్రమాదాలు జరిగిన ప్రాణాపాయం నుండి బయటపడవచ్చని డీఎస్పీ సూచించారు. ప్రయాణించే వాహనం సరైన కండిషన్లో ఉందోలేదో చుసుకోవాలని తెలిపారు.