ఈ గుంతల మీదుగా.. రాకపోకలెలా? - damage roads in malkapuram latest
కర్నూలు జిల్లా మల్కాపురంలో రోడ్లు అధ్వానంగా తయారయ్యాయి. గుంతలపై ప్రయాణాలు సాధ్యపడక... వాహనాలు అదుపు తప్పి ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులు ఆవేదన చెందుతున్నారు.
కర్నులు జిల్లా డోన్ మండలం కమలాపురం నుంచి చిన్న మల్కాపురానికి వెళ్లాలంటే.. చాలా ఇబ్బందిగా మారింది. ఈ మార్గంలో ఉన్న గుంతలు.. పగలే చుక్కలు చూపిస్తున్నాయి. 4 కిలోమీటర్ల మేర రహదారి మొత్తం.. గుంతలమయంగా మారింది. చిన్నపాటి వర్షానికే జలమయమైంది. ఏ పనులకు వెళ్లాలన్నా ఇబ్బందులు తప్పడం లేదు. వాహనాలు అదుపు తప్పి ప్రమాదాలు జరుగుతున్నాయని గ్రామస్థులు ఆవేదన చెందుతున్నారు. సమీపంలో మైనింగ్ కారణంగా భారీ వాహనాలు తిరగుతున్నాయని.. అందుకే రోడ్లు పాడైపోతున్నాయని ఆరోపించారు. గతంలో రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన జరిగినా.. పనులు ఇప్పటికీ ప్రారంభం కాలేదన్నారు.