కర్నూలు జిల్లా ఎస్పీ ఫకీరప్ప వాహనానికి ప్రమాదం జరిగింది. మంత్రి ఆళ్ల నాని పర్యటనలో భాగంగా ఎస్పీ తన వాహనంలో నంద్యాల పురపాలక కార్యాలయంలోకి వస్తుండగా..ఓ ద్విచక్రవాహనం కారును ఢీకొట్టింది. ఘటనలో కారు ముందు భాగం స్వల్పంగా దెబ్బతినగా...ఎవరికి ఎలాంటి గాయాలు కాలేదు. ప్రమాదానికి కారకుడైన ద్విచక్రవానదారుడు ఖాజా హుసేన్పై పోలీసులు కేసు నమోదు చేశారు.
ఎస్పీ కారును ఢీకొన్న ద్విచక్ర వాహనం - కర్నూలు ఎస్పీ ఫకీరప్ప తాజా వార్తలు
కర్నూలు జిల్లా ఎస్పీ ఫకీరప్ప ప్రయాణిస్తున్న వాహనాన్ని ఓ ద్విచక్ర వాహనదారుడు ఢీకొట్టాడు. ఘటనలో ఎస్పీ కారు స్వల్పంగా దెబ్బతినగా..ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదు.
![ఎస్పీ కారును ఢీకొన్న ద్విచక్ర వాహనం ఎస్పీ కారును ఢీకొన్న ద్విచక్రవాహనం](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6918317-368-6918317-1587704353915.jpg)
ఎస్పీ కారును ఢీకొన్న ద్విచక్రవాహనం