కర్నూలు జిల్లా మాధవరం సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ద్వి చక్రవాహనం, మినీ లారీ ఢీకొన్న ఘటనలో ఓ మహిళ మృతి చెందగా.. మరో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. మాధవరం గ్రామానికి చెందిన సరోజనమ్మ తన కుమారుడు, కూతురుతో కలిసి ద్విచక్రవాహనంపై వెళ్తుండగా..ఈ ప్రమాదం చోటుచేసుకుంది. క్షతగాత్రులను ఎమ్మిగనూరు ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లగా.. పరిస్థితి విషమంగా ఉండటం వల్ల మెరుగైన చికిత్సకోసం కర్నూలుకు తరలించారు.
కర్నూలులో రోడ్డు ప్రమాదం.. ఒకరి మృతి - one died
రోడ్డు ప్రమాదంలో తల్లి చనిపోగా.. కుమారుడు, కూతురు తీవ్రంగా గాయపడిన ఘటన కర్నూలు జిల్లా మాధవరం సమీపంలో చోటుచేసుకుంది.
కర్నూలులో రోడ్డు ప్రమాదం