గుర్తుతెలియని వాహనం ఢీకొని భార్యభర్తలు తీవ్రంగా గాయపడిన సంఘటన కర్నూలు సమీపంలో జరిగింది. ఓర్వకల్లు మండలం నన్నూరుకు చెందిన రామచంద్రయ్య ఆయన భార్య ద్విచక్ర వాహనం పై కర్నూలుకు వస్తుండగా.. జాతీయ రహదారిపై గుర్తుతెలియని వాహనం ఢీ కొట్టింది.
ఈ ఘటనలో.. రహదారిపై పడి ఉన్న భార్యభర్తలను అటుగా వెళ్తున్న పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి గమనించారు. వెంటనే స్పందించిన ఎమ్మెల్యే.. అంబులెన్సుకు సమాచారం ఇచ్చారు. గాయాలైన వారిని కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి చికిత్స కోసం తరలించారు.