కర్నూలు జిల్లా ఆదోని మండలం పెద్ద తుంబలం గ్రామంలో.. ఆటో అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో ఐదుగురికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స కోసం ఆదోని ప్రాంతీయ ఆసుపత్రికి తరలించారు. వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. పెద్ద తుంబలం గ్రామానికి చెందిన కూలీలు పనుల కోసం జుమాలదిన్నే గ్రామానికి వెళ్లి... తిరుగు ప్రయాణంలో ఉండగా ఈ ఘటన జరిగింది.
ఆటో బోల్తా... ఐదుగురికి గాయాలు - road accident at pedda tumbalam
కర్నూలు జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. కూలీలతో వస్తున్న ఆటో అదుపు తప్పి బోల్తా పడిన ఘటనలో ఐదుగురికి గాయాలయ్యాయి. వారిని ఆసుపత్రికి తరలించారు. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు.
ఆటో బోల్తా... ఐదుగురికి గాయాలు