కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు సమీపంలో మంత్రాలయం జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఇస్మాయిల్ (35) అనే వ్యక్తి మృతి చెందాడు. వివాహ వేడుకకు వెళ్తుండగా ద్విచక్రవాహనం అదుపు తప్పి డివైడర్ను ఢీకొట్టింది.
తీవ్రంగా గాయపడిన ఇస్మాయిల్ అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడిది ఎమ్మిగనూరు పట్టణం కాగా.. అతను ఓ బంగారు దుకాణంలో పని చేసేవాడని.. భార్య, ముగ్గురు పిల్లలున్నారని పోలీసులు గుర్తించారు. ఘటనపై కేసు నమోదు చేశారు.