ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఇంటికి చేరే దారిలోనే.. మృత్యుఒడిలోకి! - పెద్దకడుబూరులో రోడ్డు ప్రమాదం

కర్నూలు జిల్లా పెద్దకడుబూరు మండలం పెద్దతుంబళం గ్రామంలో రోడ్డు ప్రమాదం జరిగి ఇద్దరు యువకులు చనిపోయారు. ముగ్గురు యువకులు ద్విచక్రవాహనంపై ఇంటికి తిరిగి వెళ్తుండగా ఈ ఘటన జరిగింది.

road accident at peddakadaburu
రోదిస్తున్న బంధువులు

By

Published : Sep 24, 2020, 12:03 PM IST

కర్నూలు జిల్లా పెద్దకడుబూరు మండలం పెద్దతుంబళం గ్రామంలో ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఇద్దరు యువకులు మృతి చెందారు.పెద్దతుంబళం గ్రామానికి చెందిన ముగ్గురు యువకులు.. మంత్రాలయం మండలం విద్యానగర్‌ తండాకు ద్విచక్రవాహనంపై వెళ్లి రాత్రి తిరుగు ప్రయాణమయ్యారు.

పెద్దతుంబళం గ్రామశివారులోకి రాగానే ఎదురుగా వస్తున్న గుర్తుతెలియని వాహనం వారిని ఢీకొట్టింది. అటుగా వెళుతున్న ఎస్సై శ్రీనివాసులు వారిని ఆదోని ప్రాంతీయ ఆస్పత్రికి తరలించారు. అప్పటికే నగేశ్‌, రవి మృతి చెందినట్లు వైద్యులు నిర్ధరించారు. యాఖూబ్‌ చికిత్స పొందుతున్నారు. మృతుల తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు రోదనలతో ఆస్పత్రి ప్రాంగణం మారుమోగింది.

ABOUT THE AUTHOR

...view details