కర్నూలు జిల్లా ఓర్వకల్లు ఫ్లై ఓవర్ వంతెనపై రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఆటోను కారు ఢీ కొనడంతో ఐదుగురు గాయపడ్డారు. గడివేముల మండలం గడిగరేవుల నుంచి కర్నూలుకు వెళ్తున్న ఆటోను కారు ఢీకొట్టింది. దీంతో ఐదుగురు గాయపడగా వారిలో ఇద్దరికీ తీవ్ర గాయాలైనట్లు స్థానికులు వెల్లడించారు. క్షతగాత్రులను జిల్లా ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు.
జాతీయ రహదారిపై ఆటోను ఢీకొన్న కారు.. ఐదుగురికి గాయాలు - రోడ్డు ప్రమాదంలో గాయపడ్డవారు తాజా వార్తలు
కర్నూలు జిల్లా ఓర్వకల్లు వద్ద జాతీయ రహదారిపై జరిగిన ప్రమాదంలో ఐదుగురు గాయపడ్డారు. వంతెనపై ఆటోను కారు ఢీ కొనడంతో ప్రమాదం జరిగినట్లు స్థానికులు తెలిపారు.
జాతీయ రహదారిపై జరిగిన ప్రమాదంలో ఐదు మందికి గాయాలు