ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

మురుగు వ్యర్థాలు తుంగభద్రలో కలిసేలా.. - కర్నూలు జిల్లా వార్తలు

‘గంగా స్నానం-తుంగా పానం’ అనుకుంటూ పుష్కర స్నానాలకు వచ్చే భక్తులకు మురుగు వ్యథ తప్పేలా లేదు. నగరంలోని మురుగు వ్యర్థాలను తుంగభద్రలో కలవనీకుండా పైపులు ఏర్పాటు చేసేందుకు రూ.కోట్లు కుమ్మరించారు. తీరా ఆ పైపుల నుంచి వెళ్లే మురుగు ఎక్కడ కలుస్తుంది? అంటే మళ్లీ తుంగభద్రలోనే!

river pollution
river pollution

By

Published : Nov 9, 2020, 11:56 AM IST

కర్నూలు జిల్లాలో తుంగభద్ర పుష్కరాలు ఈ నెల 20వ తేదీ నుంచి డిసెంబరు 2 వరకు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో తుంగభద్ర నదీ తీరంలో 21 పుష్కర ఘాట్లను ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటికే నది కాలుష్య కోరల్లో చిక్కుకుంది. కాలుష్య నియంత్రణ మండలి(పీసీబీ) అధికారులు నదిలో ప్రమాదకర స్థాయిలో బ్యాక్టీరియాను గుర్తించారు. అలాంటప్పుడు మురుగు శుద్ధి కేంద్రాలను ఈపాటికే ఏర్పాటు చేయాల్సిన యంత్రాంగం దానిపై దృష్టి పెట్టలేదు. పుష్కరాల సమయం ముంచుకొచ్చిన తర్వాత మంజూరైన నిధుల్లో కొంత తాత్కాలిక పరిష్కారానికి కేటాయించడం గమనార్హం.

రూ.7.80 కోట్ల కేటాయింపు

కర్నూలు నగరంలోని 1 నుంచి 4 వార్డులు, 7, 9, 37 నుంచి 40, 44 నుంచి 48, 50, 51, 70 వార్డుల నుంచి మురుగు నీరు నేరుగా తుంగభద్రలో కలుస్తుంది. ప్రతి రోజూ నగర పరిధిలో 56 ఎంఎల్‌డీ మురుగు ఉత్పన్నమవుతోంది. ఈ నీటిని తాత్కాలికంగా నదిలో కలవకుండా చేసేందుకు శ్రీకారం చుట్టారు. నది తీరంలో రూ.60 లక్షలతో ఎనిమిది సంపులు ఏర్పాటు చేస్తున్నారు. వాటిల్లోకి మురుగును మళ్లించి అక్కడి నుంచి పంపింగ్‌ యంత్రాలతో పైపుల్లోకి నీరు ఎక్కించడానికి 28 యంత్రాలకు రూ.1.20 కోట్లు వెచ్చిస్తున్నారు. అలా పైపులు రోజా వీధి నుంచి జోహరాపురం వరకు 20.65 కి.మీ. దూరం వేయడానికి రూ.6 కోట్లకు టెండర్లు పిలిచారు. ఇలా మురుగు మళ్లింపునకు రూ.7.80 కోట్లు అన్నమాట.

ఎక్కడ కలుపుతారంటే?:

నగరంలో మురుగు నదిలో కలుస్తున్న ప్రదేశాల నుంచి పైపుల ద్వారా తరలించి జోహరాపురం వద్ద మళ్లీ తుంగభద్రలోనే కలపడానికి ప్రణాళికలు చేశారు. దాని సమీపంలో రాంబొట్ల ఆలయ ఘాట్‌ ఉంది. నదిలో కలుషితమయ్యే మురుగు దిగువకు ప్రవహిస్తే.. సంగమేశ్వరంలో పుష్కర ఘాట్‌ వద్దకు చేరుతుంది. సంగమేశ్వరం ఘాట్‌లో భక్తులు రద్దీ అధికంగా ఉంటుంది. నందికొట్కూరు శాతనకోట, పగిడ్యాల మండలం ముచ్చుమర్రి, పోతిరెడ్డిపాడు చాబోలు వద్ద భక్తులు పుష్కర స్నానాలు ఆచరించే అవకాశాలున్నాయి.

నాణ్యత కరవే..

సంపుల పనులు దక్కించుకున్న గుత్తేదార్లు నాణ్యతను మరిచారు. తాత్కాలికంగా ఏర్పాటు చేసే పనులైనా ఒక్కో దానికి రూ.లక్షల్లో కేటాయించారు. నిధులు జేబులు నింపుకొనేందుకే అన్న తీరున నాణ్యత లేకుండా చేస్తున్నారు. నాసిరకం కంకర వాడుతున్నారు. సిమెంట్‌ శాతం కంటే ఇసుకే ఎక్కువ కలుపుతున్నారు. పనుల పర్యవేక్షణ చేయాల్సిన అధికారులు గుత్తేదార్లకు ఒత్తాసు పలుకుతున్నారు.

ఇదీ చదవండి:

బిల్డ్ ఏపీ మిషన్‌.. పలు శాఖలకు చెందిన భూముల వేలం..!

ABOUT THE AUTHOR

...view details