కర్నూలు జిల్లా ఆళ్లగడ్డలో ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రతి గురువారం వందలాది రోగులకు అన్నదాన కార్యక్రమం చేస్తున్నారు. గత రెండున్నర సంవత్సరాలుగా పట్టణానికి చెందిన కూరపాటి చంద్ర, మల్లికార్జున రాయలు తల్లిదండ్రుల జ్ఞాపకార్ధం ఈ సేవా కార్యక్రమాన్ని చేపట్టారు. ఇక్కడ ప్రతి గురువారం సంత జరుగుతుండటంతో.. చుట్టుపక్కల గ్రామాల నుంచి వేలాది మంది ప్రజలు వస్తుంటారు. ఇదే క్రమంలో కొందరు చికిత్స కోసం ఆళ్లగడ్డ వైద్యశాలకు వస్తారు. ఇలా వచ్చిన రోగులు ఆకలి బాధలు చూసిన కూరపాటి చంద్ర, మల్లికార్జున రాయలు... ఆర్యవైశ్య అఫీషియల్స్ అండ్ ప్రొఫిషినల్స్ సేవా సంస్థతో కలిసి ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ప్రభుత్వ ఆసుపత్రి వైద్యుల అనుమతితో అన్నదానం నిర్వహిస్తున్నారు.
రోగుల ఆకలి తీర్చే "అన్న"దాతలు - karnool allagadda governament hopetal latest news updates
అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటారు.. అలాగే అనారోగ్య సమస్యలతో బాధపడుతూ వచ్చే రోగులకు సాంత్వన కలిగించే డాక్టర్ దేవుడుతో సమానం. ఇక్కడ మాత్రం బాధతో వచ్చే రోగులకు అన్నదానం చేస్తూ ఆ ఇద్దరూ దేవుళ్ళు అయ్యారు. కర్నూలు జిల్లా ఆళ్లగడ్డలోని ప్రభుత్వ ఆసుపత్రిలో గత రెండున్నరేళ్ళుగా అన్నదానం చేస్తూ రోగులపాలిట దయామయులుగా మారారు కూరపాటి చంద్ర, మల్లికార్జునరాయులు.
రోగుల ఆకలి తీర్చే "అన్న"దాతలు