మహా శివరాత్రి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై కర్నూలు జిల్లా మహానందిలో సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు. పారిశుద్ధ్యం, తాగునీరు, రహదారుల మరమ్మతులు, ఆర్టీసీ బస్సుల సౌకర్యం వంటి అంశాలపై కమిటీ సభ్యులు చర్చించారు. సమావేశంలో నంద్యాల ఆర్డీవో రామకృష్ణా రెడ్డి, ఆలయ ఈవో మల్లికార్జున ప్రసాద్, డీఎస్పీ చిదానందరెడ్డి, ఆలయ కమిటీ అధ్యక్షుడు అవుటాల రామకృష్ణారెడ్డి, సభ్యులు, పలు శాఖల అధికారులు పాల్గొన్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని ఆర్డీవో సూచించారు. మూడు రోజుల పాటు మద్యం దుకాణాలు మూసివేయాలని ఆదేశించారు. పోలీసు బందోబస్తుతో పాటు, పోలీసు సేవాదల్ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.
మహానందిలో శివరాత్రి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై సమీక్ష - కర్నూలు జిల్లా మహనందిలో మహాశివరాత్రి తాజా వార్తలు
కర్నూలు జిల్లాలో మహా శివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా మహానందిలో సమన్వయ కమిటీ సమావేశమైంది. బ్రహ్మోత్సవాల ఏర్పాట్లు, భద్రత వంటి అంశాలపై చర్చించారు.
మహనందిలో సమన్వయ కమిటీ సమావేశం