ఖరీఫ్ సీజన్లో రైతు భరోసా కేంద్రాల నుంచి చేపట్టాల్సిన చర్యలపై ఉన్నతాధికారులు చర్చించారు. నంద్యాల రైతు శిక్షణా కేంద్రం ఆవరణలో ఉన్న జిల్లా వనరుల కేంద్రంలో డివిజన్ స్థాయి సమీక్ష నిర్వహించారు. ఖరీఫ్ ప్రణాళికను సిద్ధం చేశారు.
ఖరీఫ్ సాగు ప్రణాళికపై.. కార్యాచరణ సిద్ధం చేసిన ఉన్నతాధికారులు - Review Meeting at Nandyala Farmer Assurance Centers
కర్నూలు జిల్లా నంద్యాల రైతు శిక్షణా కేంద్రం ఆవరణలో ఉన్న.. రైతు భరోసా కేంద్రాల జిల్లా వనరుల కేంద్రం (డీఆర్సీ) లో డివిజన్ స్థాయి సమీక్ష సమావేశం జరిగింది.
నంద్యాల రైతు భరోసా కేంద్రాల్లో సమీక్షా సమావేశం
నంద్యాల, ఆళ్లగడ్డ, కొయిలకుంట్ల నియోజకవర్గ పరిధిలోని వ్యవసాయ శాఖ, అనుబంధ శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. జిల్లా వ్యవసాయశాఖ సంయుక్త సంచాలకులు ఉమా మహేశ్వరమ్మ, ఉప సంచాలకులు విల్సన్, తదితరులు హాజరయ్యారు.