కరోనా ఎఫెక్ట్: శ్రీశైలం దేవస్థానం కీలక నిర్ణయాలు - శ్రీశైలంలో కొవిడ్ ఆంక్షలు
19:47 January 16
కరోనా నియంత్రణకు శ్రీశైలం దేవస్థానం కీలక నిర్ణయాలు
Covid Restrictions On Srisailam:కొవిడ్ నియంత్రణకు దేవాదాయ శాఖ ఆదేశాల మేరకు కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు శ్రీశైల దేవస్థానం ఈవో ఎస్.లవన్న తెలిపారు. ఈ సందర్భంగా శ్రీశైలంలో శ్రీ మల్లికార్జున స్వామి స్పర్శ దర్శనం నిలుపుదల చేస్తున్నట్లు స్పష్టం చేశారు. సర్వదర్శనంతో పాటు అన్న ప్రసాద వితరణ, పాతాళ గంగలో పుణ్య స్నానాలు తాత్కాలికంగా నిలుపుదల చేశామని ఈవో వెల్లడించారు. రోజుకు 4 విడతల్లో సామూహిక అభిషేకాలు నిర్వహించుకునే లా ఏర్పాట్లు చేశామన్నారు. ఈ నెల 18 నుంచి ఆర్జిత సేవల టిక్కెట్లు ఆన్ లైన్ ద్వారా భక్తుల టికెట్లు పొందాల్సి ఉంటుందని ఈవో చెప్పారు. శీఘ్ర, అతిశీఘ్ర దర్శనం టికెట్లు కూడా ఆన్ లైన్ ద్వారా పొందే అవకాశం ఉందన్నారు. ఆన్ లైన్ రిజిస్ట్రేషన్‌కు కొవిడ్ వ్యాక్సినేషన్ ధ్రువీకరణ పత్రం తప్పనిసరి చేసినట్లు తెలిపారు. గంటకు 1000 మంది భక్తులకు దర్శనం కల్పించనున్నట్లు చెప్పారు. ఆర్జిత సేవలు కూడా 50 శాతంతో అమలు చేస్తున్నామన్నారు. ఉచిత దర్శనానికి ఆన్ లైన్ లో ముందస్తుగా నమోదుకు అవకాశం ఉందన్నారు. శ్రీశైల దేవస్థానం వెబ్ సైట్ srisaila devasthanam.org ద్వారా ఆర్జిత సేవలు, దర్శనం రిజిస్ట్రేషన్ చేసుకోవాలని ఈవో తెలిపారు.
ఇదీ చదవండి :
Prabhalu: కోనసీమలో వైభవంగా ప్రభల తీర్థం