రెండు నెలలక్రితం శ్రీశైలం ఎడమగట్టు జలవిద్యుత్ కేంద్రంలో ప్రమాదం సంభవించిన సంగతి తెలిసిందే. అగ్నిప్రమాదం కారణంగా జలవిద్యుత్ కేంద్రంలో ఆరు యూనిట్లు దెబ్బతిన్నాయి. పాక్షికంగా దెబ్బతిన్న 1, 2 యూనిట్లను పునరుద్ధరించిన అధికారులు... విద్యుదుత్పత్తిని గ్రిడ్‌కు అనుసంధానం చేశారు. ఒక్కో యూనిట్ ద్వారా 150 మెగావాట్ల విద్యుదుత్పత్తి జరుగుతుంది.
శ్రీశైలం ఎడమగట్టు జలవిద్యుత్ కేంద్రంలో విద్యుదుత్పత్తి పునరుద్ధరణ - Power generation in srisailam hydroelectric power station news
శ్రీశైలం ఎడమగట్టు జలవిద్యుత్ కేంద్రంలో విద్యుదుత్పత్తి పునరుద్ధరణ జరిగింది. ఒకటి, రెండు యూనిట్లలో ఉత్పత్తిని అధికారులు ప్రారంభించారు. జలవిద్యుత్ కేంద్రంలో తెలంగాణ మంత్రి జగదీశ్‌రెడ్డి పూజలు చేసి స్విచ్ఛాన్ చేశారు.
శ్రీశైలం ఎడమగట్టు జలవిద్యుత్ కేంద్రంలో విద్యుదుత్పత్తి పునరుద్ధరణ