ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

రెడ్ జోన్​లో కంచెలు తొలగించాలని స్థానికుల ఆందోళన - kurnool polie removed fence in red zone

కర్నూలు వడ్డెగెరి కాలనీ వాసులు రెడ్ జోన్ లో వేసిన కంచెలు తొలగించాలని ఆందోళన చేశారు. ఆసుపత్రికి వెళ్లాలంటే ఇబ్బందిగా మారుతోందని పోలీసులతో వాగ్వాదానికి దిగారు. చివరికి రోడ్డుకు ఉన్న కంచెను పోలీసులు తొలగించాకే ఆందోళన విరమించారు.

Residents of Red Zone in Kurnool demand for remove fence
కర్నూలులో రెడ్ జోన్ కంచెలు తొలగించాలని స్థానికుల ఆందోళన

By

Published : May 21, 2020, 7:46 AM IST

కర్నూలు వడ్డెగెరి కాలనీ మొత్తం రెడ్ జోన్ లో ఉన్నందున పోలీసులు అన్నీ రహదారులు బంద్ చేశారు. ఓ మహిళకు అనార్యోగం కారణంగా ఆసుపత్రికి తీసుకెళ్లేందుకు వెళ్లగా రహదారులన్నీ ఎక్కడికక్కడ మూసి ఉన్నాయి. ఆసుపత్రికి వెళ్లేందుకు ఆలస్యం అయిన పరిస్థితుల్లో... స్థానికులు పెద్ద ఎత్తున ఆందోళన చేశారు.

జబ్బు చేసిన వారు వైద్యులకు చూపించుకోోవాలంటే ఆంక్షల కారణంగా ఇబ్బంది అవుతోందని చెప్పారు. ముందు.. ఆ కంచెలను తొలగించాలని డిమాండ్ చేశారు. స్థానిక ఎమ్మెల్యే హాఫీజ్ ఖాన్, డీఎస్పీ బాబా ఫకృద్దిన్ పరిస్థితిని చక్కదిద్దారు. రోడ్డుకు ఉన్న కంచెను పోలీసులు తొలగించగా.. ప్రజలు ఆందోళన విరమించారు.

ABOUT THE AUTHOR

...view details