కర్నూలు జిల్లా నంద్యాలలో ఉపాధ్యాయుల సమస్యలు తొందరగా పరిష్కరించాలని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ కత్తి నరసింహారెడ్డి.. ఉన్నతాధికారులను విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం నాయకులతో కలిసి వెళ్లి నంద్యాల మున్సిపల్ కమిషనర్ వెంకటకృష్ణకు ఆయన వినతిపత్రం అందజేశారు.
సమస్యల పరిష్కార పక్రియలో జాప్యం జరుగుతోందని అన్నారు. ఈ విషయమై వెంటనే స్పందించి ఉపాధ్యాయులకు న్యాయం చేయాలని ఆయన కోరారు. రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం నాయకులు చంద్రశేఖర్, నాగేంద్ర కుమార్, లక్ష్మన్న తదితరులు పాల్గొన్నారు.