హంద్రీనివా సుజల స్రవంతి పథకం కింద.. నీళ్లు పొలాలకు అందుతున్నాయి. మల్యాల నుంచి అధికారులు నీటిని విడుదల చేశారు. మొదట రెండు పంపుల ద్వారా సుమారు 700 క్యూసెక్కుల నీటిని ఎత్తిపోస్తున్నారు. నీటి ఎద్దడితో అల్లాడుతున్న కర్నూలు, అనంతపురం, చిత్తూరు జిల్లాలోని కొన్ని ప్రాంతాలకు హంద్రీనివా పథకం ద్వారా నీటిని అందించనున్నారు. క్రమంగా నీటి విడుదలను పెంచుతామని అధికారులు చెప్పారు.
హంద్రీనివా ద్వారా నీటి విడుదల... రైతుల ఆనందం - Handriniva
హంద్రీనివా సుజల స్రవంతి పథకానికి.. మల్యాల నుంచి నీటి విడుదల ప్రారంభించారు. 700 క్యూసెక్కుల నీటిని ఎత్తిపోస్తున్నారు. నీటి విడుదలపై రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
హంద్రీనివా ద్వారా నీటి విడుదల