కర్నూలు జిల్లా ఆదోనిలో రేపటి నుంచి లాక్ డౌన్ నిబంధనలు సడలిస్తూ అధికారులు అనుమతులిచ్చారు. కరోనా తీవ్రత దృష్ట్యా కొన్ని నెలలుగా ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు మాత్రమే దుకాణాలు తెరిచేందుకు అనమతులు ఇచ్చారు. సమయం తక్కువగా ఉండటం దుకాణాదారులు ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి ను ఆశ్రయించారు. వ్యాపారులు నష్టపోతున్నారనే ఉద్దేశంతో అధికారులతో మాట్లాడిన ఎమ్మెల్యే సమయం పొడిగించాలని కోరారు. ఈమేరకు అధికారులు సాయంత్రం ఆరు గంటల వరకు కూడా కరోనా నిబంధనలు పాటిస్తూ వ్యాపారాలు చేసుకునేందుకు అనుమతులు ఇచ్చారు.
ఆదోనిలో లాక్ డౌన్ నిబంధనలు సడలింపు - corona cases in kurnool district news update
కర్నూలు జిల్లా ఆదోనిలో లాక్ డౌన్ నిబంధనలను సడలించారు. కొన్ని రోజులుగా ఉదయం 6 గంటల నుంచి 2 గంటల వరకే వ్యాపార, వాణిజ్యాలకు అనుమతులిచ్చారు. రేపటితో కొన్ని నిబంధనలు సడలిస్తూ అధికారులు పలు కార్యక్రమాలకు అనుమతులిచ్చారు.

ఆదోనిలో లాక్ డౌన్ నిబంధనలు సడలింపు
ఇవీ చూడండి...