ఎన్జీవో కాలనీలోని తన గదిలో ఉన్న ప్రహ్లాద్ రెడ్డిని.. అతడి బంధువులు బయటకు పిలిచారు. కర్రలతో, ఇటుకలతో దాడి చేసి గాయపరిచారు. బాధితుడిని స్థానికులు చికిత్స నిమిత్తం నంద్యాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
తనకు ఇవ్వాల్సిన డబ్బును అడిగినందుకు దాడి చేశారని ప్రహ్లాద్ రెడ్డి ఆరోపించాడు. ఆళ్లగడ్డ ఎమ్మెల్సీ గంగుల ప్రభాకర్ రెడ్డి పిలుస్తున్నాడంటూ వచ్చి తనపై దాడి చేశారని ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ ఘటనపై పోలీసుల విచారణ చేపట్టారు.