కార్తీక మాసాన్ని పురస్కరించుకుని....కర్నూలులో రెడ్డి సామాజిక వర్గం వన భోజన కార్యక్రమాన్ని నిర్వహించింది. నగర సమీపంలోని రాగ మయురీ రిసార్ట్స్‌లో నిర్వహించిన ఈ కార్యక్రమంలో రెడ్డి సామాజిక వర్గం వారు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని వారు సంతకాల సేకరణ చేశారు. వివిధ రాజకీయపార్టీలకు చెందిన ప్రముఖులు వనభోజనానికి హాజరయ్యారు. ఈసందర్భంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాల్లో జబర్దస్త్ ఫేం శాంతిస్వరూప్ మిమిక్రి అందరినీ అలరించింది.
'కర్నూల్లో ఉల్లాసంగా రెడ్డి సామాజిక వర్గ వనభోజన కార్యక్రమం' - జబర్దస్త్
రెడ్డి సామాజిక వర్గం కార్తీక మాసాన్ని పురస్కరించుకుని కర్నూలు జిల్లాలో వనభోజన కార్యక్రమాన్ని నిర్వహించింది. జబర్దస్త్ ఫేం శాంతిస్వరూప్ మిమిక్రీ అందరినీ అలరించింది.
కర్నూల్లో రెడ్డి సామాజిక వర్గ వనభోజన కార్యక్రమం