ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కరోనా: రెడ్‌, ఆరెంజ్‌, గ్రీన్‌ జోన్లు అంటే ఏమిటీ..? - కరోనా: రెడ్‌, ఆరెంజ్‌, గ్రీన్‌ జోన్లు అంటే ఏమిటీ..?

కరోనా పాజిటివ్‌ కేసుల నమోదు ఆధారంగా రాష్ట్రంలోని మండలాలను రెడ్‌, ఆరెంజ్‌, గ్రీన్‌ జోన్లుగా విభజించారు. రాష్ట్రంలో 676 మండలాలు ఉన్నాయి. విదేశాలు, దిల్లీ, ఇతర రాష్ట్రాల నుంచి రావడం, సామాజిక వ్యాప్తి ద్వారా నమోదైన పాజిటివ్‌ కేసుల ఆధారంగా వైద్య ఆరోగ్యశాఖ మండలాలను గుర్తించింది. ఆదివారం నాటికి 40 మండలాలు రెడ్‌, 45 ఆరెంజ్‌, మిగిలినవి గ్రీన్‌జోన్‌లో ఉన్నాయి.

Red zones in Andhra Pradesh
కరోనా: రెడ్‌, ఆరెంజ్‌, గ్రీన్‌ జోన్లు అంటే ఏమిటీ..?

By

Published : Apr 13, 2020, 6:37 AM IST

ఏ జిల్లాలో ఎన్నెన్ని...

కర్నూలు జిల్లాలో గరిష్ఠంగా 8 మండలాలు రెడ్‌జోన్‌ పరిధిలో ఉన్నాయి. నెల్లూరులో 5, చిత్తూరు, ప్రకాశంలో 4, గుంటూరులో 3 మండలాలను ఈ పరిధిలోకి తెచ్చారు. గుంటూరు నగరం మొత్తం రెడ్‌జోన్‌లోనే ఉంది. విశాఖపట్నంలోనూ ఇదే పరిస్థితి. విజయవాడ అర్బన్‌ మొత్తాన్ని రెడ్‌జోన్‌గా ప్రకటించారు. శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో అన్నీ గ్రీన్‌జోన్లే ఉన్నాయి.

వ్యవసాయ కార్యకలాపాలపై ఏ జోన్‌లోనూ ఆంక్షలు లేవు. జనం గుమిగూడకుండా ఉండేలా ప్రార్థన మందిరాల నిర్వహణపై ఆంక్షలు విధించారు. ఆరెంజ్‌ జోన్‌లో ఉన్న మండలాల్లో వివాహాలకు షరతులతో అనుమతించారు. రెడ్‌జోన్‌లో వివాహాలను నిషేధించారు. రెడ్‌, ఆరెంజ్‌ జోన్లలో మాల్స్‌ను తెరవకూడదు. మూడు జోన్లలో సినిమాహాళ్లలో చలనచిత్రాలు ప్రదర్శించకూడదు.

కరోనా: రెడ్‌, ఆరెంజ్‌, గ్రీన్‌ జోన్లు అంటే ఏమిటీ..?

రెడ్‌జోన్‌ ప్రామాణికం...

1.ప్రయాణనేపథ్యం (విదేశాలు లేదా దిల్లీ) లేకుండా పాజిటివ్‌ కేసులు

2.ఇంట్లోనివారితో కాకుండా సామాజిక వ్యాప్తితో వ్యాధి సోకడం

3.ఒకే ఇంట్లో ఒకరి కంటే ఎక్కువ మందికి

4.మండలంలో 4 కేసులు, ఎక్కువగా సామాజిక వ్యాప్తితో కేసులు నమోదైతే

కరోనా: రెడ్‌, ఆరెంజ్‌, గ్రీన్‌ జోన్లు అంటే ఏమిటీ..?

ఆరెంజ్‌ జోన్‌ ప్రామాణికం: మండలంలో ఒకే పాజిటివ్‌ కేసు ఉండటం

గ్రీన్‌జోన్‌ ప్రామాణికం:పాజిటివ్‌ కేసులు నమోదుకాని మండలాలు

ఇదీ చదవండీ...కరోనా నుంచి బయటపడినా మళ్లీ సోకనుందా..?

ABOUT THE AUTHOR

...view details