రాయలసీమ అభివృద్ధికి దోహదపడే అంశాలపై ప్రస్తుత పార్టీల నాయకులు నిర్లక్ష్యం చేస్తే మరో పార్టీ ఏర్పాటు కావడం తథ్యమని రాయలసీమ సాగునీటి సమితి అధ్యక్షుడు బొజ్జా దశరథ రామిరెడ్డి అన్నారు. ప్రస్తుత రాజకీయ పార్టీల నాయకులు రాయలసీమ అభివృద్ధికి తోడ్పాటు ఇవ్వాలని ఆయన విజ్ఞప్తి చేశారు. రాయలసీమ సమస్యల పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ.. ఈ నెల 16 న రాయలసీమ సత్యాగ్రహం కార్యక్రమం నిర్వహిస్తున్నామని అయన అన్నారు. సంబంధించిన గోడ పత్రికలను కర్నూలు జిల్లా నంద్యాలలో రాయలసీమ సాధన సమితి సభ్యులతో కలిసి విడుదల చేశారు.
ఈ నెల 16న రాయలసీమ సత్యాగ్రహం కార్యక్రమం - రాయలసీమ అభివృధ్ది వార్తలు
రాయలసీమ జిల్లాల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ నవంబర్ 16న రాయలసీమ సత్యగ్రహం కార్యక్రమం చేపట్టనున్నట్లు రాయలసీమ సాగునీటి సమితి అధ్యక్షుడు బొజ్జా దశరథ రామిరెడ్డి తెలిపారు.
ఈ నెల 16న రాయలసీమ సత్యాగ్రహం కార్యక్రమం