ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

శ్రీశైలంలో వైభవంగా సంక్రాంతి బ్రహ్మోత్సవాలు - Sankranthi Brahmotsavalu

ప్రముఖ శైవక్షేత్రం శ్రీశైల మల్లిఖార్జున స్వామి దేవాలయంలోమూడో రోజు సంక్రాంతి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. శ్రీస్వామి అమ్మవార్ల ఉత్సవ మూర్తులను రావణ వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు.

Sankranthi Brahmotsavalu
శ్రీశైలంలో వైభవంగా సంక్రాంతి బ్రహ్మోత్సవాలు

By

Published : Jan 14, 2021, 6:24 AM IST

శ్రీశైలంలో వైభవంగా సంక్రాంతి బ్రహ్మోత్సవాలు

శ్రీశైలమహాక్షేత్రంలో సంక్రాంతి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాల మూడోరోజు శ్రీ పార్వతీ సమేత మల్లికార్జున స్వామి వార్లు రావణ వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయ ప్రాంగణంలోని అలంకార మండపంలో శ్రీస్వామి అమ్మవార్ల ఉత్సవ మూర్తులను అర్చకులు, వేదపండితులు వేద మంత్రోచ్ఛారణలు పఠించి పుష్పార్చనలు, మంగళ హారతులతో పూజించారు. భక్తజన శివనామ స్మరణంతో ఆలయ మాడవీధుల్లో స్వామి అమ్మవార్లకు ఉత్సవం నిర్వహించారు. భక్తుల భారీగా పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ బ్రహ్మోత్సవాలు 17వ తేదీవరకు జరుగనున్నాయి.

ABOUT THE AUTHOR

...view details