శ్రీశైలం మహక్షేత్రంలో మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరిగాయి. తొమ్మిదో రోజు శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి వార్లకు శోభాయమానంగా రథోత్సవం జరిగింది. కళాకారులు నృత్యాలు చేసి సందడి చేశారు. బుగ్గ సంగమేశ్వర స్వామి రథోత్సవం కమనీయంగా సాగింది. ఆదిదంపతుల కళ్యాణ వేడుకలను తిలకించేందుకు భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. మహా శివరాత్రి బ్రహ్మోత్సవాల్లో చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలో ఘనంగా తెప్పోత్సవం నిర్వహించారు. అది దంపతుల తెప్పోత్సవం కనులారా తిలకించేందుకు అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం శ్రీ రాజరాజేశ్వరి సమేత ఉమా కుక్కుటేశ్వర స్వామి దేవస్థానంలో రథోత్సవం వైభవంగా జరిగింది. పశ్చిమ గోదావరి జిల్లా పంచారామాలలో విశిష్టమైన సోమారామంలో రథోత్సవం ఘనంగా జరిగింది. మహా శివరాత్రి ఉత్సవాల్లో భాగంగా భీమవరంలోని సోమేశ్వరస్వామికి రథోత్సవం నిర్వహించారు.
శోభాయమానంగా రథోత్సవం - teppostavam at srikalahasti
మహాశివరాత్రి సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రముఖ ఆలయాల్లో బ్రహ్మోత్సవాలు, ఇతర వేడుకలు వైభవంగా జరిగాయి. భక్త కోటి శివనామస్మరణతో ఆలయాలు మార్మోగాయి.
శోభాయమానంగా రథోత్సవం