ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'సలాం కుటుంబం ఆత్మహత్య కేసు సీబీఐకి అప్పగించాలి' - salam family suicide case

అబ్దుల్​ సలాం కుటుంబం ఆత్మహత్య కేసును సీబీఐకి అప్పగించాలని సలాం న్యాయ పోరాట సమితి నాయకులు డిమాండ్ చేశారు. కర్నూలు జిల్లా నంద్యాలలోని సంజీవనగర్ గేట్ వద్ద రాస్తా రోకో నిర్వహించారు.

handover salam case to CBI
రోడ్డుపై ఆందోళన చేస్తున్న కమిటీ నాయకులు

By

Published : Nov 30, 2020, 5:58 PM IST

ప్రభుత్వం వెంటనే స్పందించి అబ్దుల్​ సలాం కేసును సీబీఐకి అప్పగించాలని సలాం న్యాయ పోరాట సమితి నాయకులు డిమాండ్ చేశారు. దీనిపై అసెంబ్లీలో తీర్మానం చేయాలని సమితి రాష్ట్ర కన్వీనర్ మౌలానా ముస్తాక్ అహమ్మద్ అన్నారు. కర్నూలు జిల్లా నంద్యాలలోని సంజీవనగర్ గేట్ వద్ద రాస్తా రోకో నిర్వహించారు.

రోడ్డుపై వాహనాలను నిలిపి వేయించి..ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పిల్లలతో సహా ఆత్మహత్యకు పాల్పడ్డారంటే సలాం కుటుంబం ఎంత ఒత్తిడి అనుభవించి ఉంటుందో ఆలోచించాలని సమితి రాష్ట్ర కన్వీనర్ అన్నారు. ఈ కార్యక్రమంలో ముస్లిం ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి: పోలీస్​ స్టేషన్​ ఎదుట ఆందోళన.. వ్యక్తిపై పోలీసుల దాడి

ABOUT THE AUTHOR

...view details