రాయలసీమ రైతులకు కర్నూలు జిల్లా నంద్యాల పరిశోధన కేంద్రం ఆయువుపట్టు లాంటిది. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ సెంటర్ నుంచి ప్రతి ఏటా 25 కోట్ల రూపాయలకుపైగా నిధులు అందుతాయి. ఐసీఆర్ కింద రాష్ట్రంలోనే 7 అత్యధిక పథకాలు ఇక్కడే అమలవుతున్నాయి. ఈ వ్యవసాయ పరిశోధన కేంద్రంలో 105 ఎకరాల భూమి ఉంది. ఇందులో పది ఎకరాల్లో రోడ్లు, భవన నిర్మాణాలు ఉన్నాయి. మిగిలిన 95 ఎకరాల్లో పత్తి, శనగ, మొక్కజొన్న, వరి, జొన్న, చిరుధాన్యాల పంటలు సాగవుతున్నాయి. ఈ పరిశోధన కేంద్రం, రైతు శిక్షణా కేంద్రంతో కలిపి 50 ఎకరాలు వైద్య కళాశాలకు కేటాయిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.
నివేదిక బేఖాతరు
ఒక ప్రభుత్వ సంస్థ భూములు మరొక ప్రభుత్వ సంస్థకు కేటాయించాలంటే జీవో నంబర్ 571 ప్రకారం పరిశోధనా స్థానం అధిపతి అనుమతి పొందాలి. కానీ అలాంటిదేమి లేకుండానే భూముల కేటాయింపు జరిగింది. ఈ భూములపై సర్వే నెంబర్‌లతో రెండున్నర నెలల కిందట పరిశోధన కేంద్రానికి నోటీసులిచ్చారు. 15రోజుల్లోగా వివరణ ఇవ్వాలని కోరగా... పూర్తి వివరాలతో..పంట భూములు కేటాయింపునకు అభ్యంతరం తెలుపుతూ..వారం రోజుల్లోనే RARS అధికారులు నివేదిక పంపారు. అయినా నేతల ఒత్తిళ్లతో ఆ నివేదికను బేఖాతరు చేశారు.
శతాబ్దానికి పైగా చరిత్ర