కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో గైనిక్ విభాగంలో గర్భ సంచి వెలుపల ఉన్న పిండాన్ని అరుదైన శస్త్ర చికిత్స ద్వారా తొలగించారు. కర్నూలు జిల్లా కోడుమూరు మండలం వల్కూరు గ్రామానికి చెందిన జ్యోతి అనే మహిళ కడుపు నొప్పి, వాంతులతో ప్రభుత్వ ఆసుపత్రిలో చేరింది. ఆమెకు అల్ట్రాసౌండ్, ఎంఆర్ఐ చేయగా గర్బసంచికి బయట పిండధారణ జరిగినట్లు వైద్యులు నిర్ధారించారు. ఇలాంటివి అత్యంత అరుదుగా ఉంటాయని వైద్యులు తెలిపారు. ఉదరంలో గర్భధారణ ప్రాణాంతకమన్నారు. గైనిక్ విభాగాధిపతి డాక్టర్ రాధాలక్ష్మీ ఆధ్వర్యంలో శస్త్రచికిత్స చేసి పిండాన్ని తొలగించారు. ప్రస్తుతం ఆమె కొలుకుంటోంది.
కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో అరుదైన శస్త్ర చికిత్స - కోడుమూరు మండలం తాజా వార్తలు
కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలోని గైనిక్ విభాగంలో అరుదైన శస్త్ర చికిత్స ద్వారా పిండాన్ని తొలగించారు. గర్భ సంచి వెలుపల ఉన్న పిండాన్ని గైనిక్ విభాగాధిపతి డాక్టర్ రాధాలక్ష్మీ ఆధ్వర్యంలో శస్త్రచికిత్స చేసి తీసేశారు.
![కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో అరుదైన శస్త్ర చికిత్స kurnool govt hospital](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-10695462-582-10695462-1613743630461.jpg)
కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో అరుదైన శస్త్ర చికిత్స..