కర్నూలు జిల్లా దేవనకొండ మండలంలో 8వ తరగతి చదువుతున్న ఓ బాలిక పట్ల గుర్తుతెలియని వ్యక్తి అసభ్యంగా ప్రవర్తించాడు. బాలిక తల్లిదండ్రులు పొలానికి వెళ్లిన సమయంలో వారి సమీప బంధువైన ఓ మహిళ.. గుర్తుతెలియని వ్యక్తిని ఇంట్లోకి తీసుకువచ్చింది. అతను బాలికతో అసభ్యకరంగా ప్రవర్తించి దాడికి పాల్పడినట్లు బాలిక తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాలికను చికిత్స నిమిత్తం కర్నూలు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన దేవనకొండ పోలీసులు విచారణ చేస్తున్నారు. చికిత్స పొందుతున్న బాలికను వివరాలు అడిగి తెలుసుకున్నారు.
బాలిక పట్ల గుర్తుతెలియని వ్యక్తి అసభ్యప్రవర్తన.. కేసు నమోదు - rape attempt in kurnool district
కర్నూలు జిల్లాలో 12 ఏళ్ల బాలికపై గుర్తు తెలియని వ్యక్తి అసభ్యంగా ప్రవర్తించాడని బాలిక తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.

బాలికపై గుర్తుతెలియని వ్యక్తి అసభ్యప్రవర్తన.. కేసు నమోదు