కర్నూలులో పేద ముస్లింలకు రంజాన్ తోఫా - శాంతి ఆశ్రమం
శాంతి ఆశ్రమం ఆధ్వర్యంలో పేద ముస్లింలకు రంజాన్ తోఫా పంపిణీ చేశారు. తోఫాను ఎమ్మెల్యేలు రాంభూపాల్ రెడ్డి, హఫీజ్‌ఖాన్, కలెక్టర్ సత్యనారాయణ అందజేశారు.
![కర్నూలులో పేద ముస్లింలకు రంజాన్ తోఫా](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-3442498-thumbnail-3x2-thofa.jpg)
ramjan-thofa
శాంతి ఆశ్రమం ఆధ్వర్యంలో పేద ముస్లింలకు రంజాన్ తోఫా
కర్నూలు జిల్లా అంటేనే మత సామరస్యానికి ప్రతీకని.. ఎమ్మెల్యే హపీజ్ ఖాన్ అన్నారు. రంజాన్ పండుగ సందర్భంగా శాంతి ఆశ్రమం ట్రస్ట్ ఆధ్వర్యంలో.. పేద ముస్లింలకు రంజాన్ తోఫాను అందించారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ సత్యనారాయణ, ఎమ్మెల్యేలు కాటసాని రాంభూపాల్ రెడ్డి, సుధాకర్, హఫీజ్ ఖాన్, ఎమ్మెల్సీ కేఈ ప్రభాకర్ పాల్గొన్నారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా వైకాపా పని చేస్తుందని ఎమ్మెల్యేలు తెలిపారు.