Actor Ram Charan In Kurnool : కర్నూలు నగరంలో సినీ హీరో రామ్ చరణ్ సందడి చేస్తున్నారు. నగరంలోని కొండారెడ్డి బురుజు వద్ద రామ్ చరణ్ నటిస్తున్న సినిమా చిత్రికరణ జరుగుతోంది. రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న.. ఈ సినిమా చిత్రీకరణను కొండారెడ్డి బురుజుపై తీస్తున్నారు. ఇందుకోసం రామ్ చరణ్ కర్నూలు ఇప్పటికే చేరుకుని సినిమా చిత్రీకరణలో పాల్గోన్నారు. ఈ విషయం తెలుసుకున్న అభిమానులు పెద్ద ఎత్తున కొండారెడ్డి బురుజు వద్దకు చేరుకున్నారు. తమ అభిమాన నటుడ్ని కర్నూలులో చూసి సంతోషంతో కేరింతలు కొట్టారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజు నిర్మాతగా.. శంకర్ దర్శకత్వంలో హీరో రామ్ చరణ్ నూతన చిత్ర తెరకెక్కనుంది. ఈ సినిమాలో రామ్ చరణ్‌తో పాటు నటించనున్న మరో హీరో శ్రీకాంత్, రాజీవ్ కనకాల అక్కడికి చేరుకున్నారు.
కర్నూలులో నటుడు రామ్ చరణ్.. భారీగా తరలివచ్చిన అభిమానులు - Konda Reddy Fort
Actor Ram Charan : కర్నూలు నగరంలో నటుడు రామ్ చరణ్ సందడి చేస్తున్నారు. రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న సినిమా చిత్రీకరణ నగరంలో జరగనుంది. ఇందులో పాల్గొనేందుకు నటుడు రామ్ చరణ్ నగరానికి చేరుకున్నారు.
కర్నూలులో నటుడు రామ్ చరణ్
Last Updated : Feb 10, 2023, 2:54 PM IST