కర్నూలు జిల్లాలో వైస్సార్ రైతు భరోసా కార్యక్రమాన్ని అట్టహాసంగా జరిగింది.డోన్ లో మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి రైతు భరోసా కార్యక్రమంలో పాల్గొన్నారు.రైతుకు భరోసా ఉంటేనే రాష్ట్రం బాగుంటుందని మంత్రి చెప్పారు.ఆలూరులో భరోసా కార్యక్రమంలో గుమ్మనూరు జయరాం పాల్గొన్నారు.పత్తికొండలో ఎమ్మెల్యే శ్రీదేవి చెక్కులను పంపిణీ చేశారు.అర్హులైన ప్రతి ఒక్కరికీ రైతు భరోసా అందుతుందని తెలిపారు.బనగానపల్లె కోవెలకుంట్లలో రైతు భరోసా కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.ఈ కార్యక్రమం ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి,ఎమ్మెల్సీ చల్లా రామకృష్ణారెడ్డి పాల్గొని రైతులకు భరోసా చెక్కులను పంపిణి చేశారు.
కర్నూలు జిల్లాలో ఘనంగా రైతు భరోసా ప్రారంభం - ysr raithu bharosa
కర్నూలు జిల్లాలో వైఎస్సార్ రైతు భరోసా పథకం అట్టహాసంగా ప్రారంభం అయింది. ఆయా నియోజకవర్గాలకు చెందిన ప్రజాపతినిధులు,అధికారులు..లబ్ధిదారులకు చెక్ లను అందించారు.
కర్నూలు జిల్లాలో ఘనంగా రైతు భరోసా ప్రారంభం