కర్నూలు జిల్లా పత్తికొండలో నిర్వహించే వారపు సంతలో ప్రతి సోమవారం భారీగా ప్రజలు తరలి వస్తారు. కూరగాయలు, ఇతర సరకులు కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతారు. దీని కోసం పంచాయతీ శాఖ... రైతు బజార్ భవనాన్ని నిర్మించారు. అయితే ఇప్పటికీ ఆ భవనం ప్రారంభానికి నోచుకోక వ్యాపారులు తీవ్రంగా నష్టపోతున్నారు. కొందరు ప్రధాన రహదారిపై దుకాణాలు ఏర్పాటు చేసుకున్నారు. మరికొందరు పంచాయతీ మార్కెట్ స్థలంలోనే దుకాణాలు ఏర్పాటు చేసుకున్నారు. లోపల ఉన్న వారికి వ్యాపారం లేక మార్కెట్ వెలవెలబోతోంది. ప్రజలు రోడ్డుపైనే ఉన్న వ్యాపారుల వద్ద కొనుగోలు చేస్తుండగా... తమ వద్దకు ఎవరూ రావడం లేదంటున్నారు వ్యాపారులు. ఇప్పటికైనా రైతు బజార్ ప్రారంభించి ఇబ్బందులు తీర్చాలంటున్నారు. ఈ విషయమై పంచాయతీ కార్యదర్శి కృష్ణకుమార్ దృష్టికి తీసుకెళ్లగా.. రైతు బజార్ ప్రారంభంతోపాటు... మార్కెట్లోని వ్యాపార ఇబ్బందులు తీర్చేందుకు చర్యలు తీసుకుంటామన్నారు.
'కొనుగోళ్లు లేక నష్టపోతున్న వ్యాపారులు' - 'రైతు బజార్‌ను ప్రారంభించాలి'
పంచాయతీ వారు రైతు బజార్ ఏర్పాటు చేసిన... ప్రారంభానికి నోచుకోక నష్టపోతున్నామని పత్తికొండ వ్యాపారస్థులు వాపోతున్నారు.

పత్తికొండ రైతు బజార్
Last Updated : Dec 17, 2019, 8:22 AM IST