జులై మరో 10 రోజుల్లో ముగిస్తున్నా కర్నూలు జిల్లాలో లోటు వర్షపాతమే నమోదైంది. సాధారణ విస్తీర్ణంలో కనీస శాతం కూడా పంటలు సాగుచేయలేదు. వర్షాలు పడతాయో.. లేదోనని అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. వాతావరణం అనుకూలించి ఈనెలాఖరు నాటికి వర్షాలు పడితే అన్ని పంటలు సాగు చేయవచ్చునని కర్నూలు జిల్లా నంద్యాల ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన సంస్థ అధికారులు చెబుతున్నారు. ఈ మేరకు.. ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన సంస్థ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. వ్యవసాయ శాస్త్రవేత్తలు, అధికారులు పాల్గొని పంటలసాగు స్థితిగతులపై చర్చించారు. అగష్టు వరకు ఇదే పరిస్థితి కొనసాగితే ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి పెట్టాలని సహ వ్యవసాయ సంచాలకులు డాక్టర్ సుబ్బారావు సూచించారు.
వాతావరణం అనుకూలిస్తే ఈ నెలాఖరుకు సాగు - officers meeting
కర్నూలు జిల్లాలో వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. జులై నెల ఇంకో 10 రోజుల్లో ముగుస్తున్నా.. జిల్లాలో లోటు వర్షపాతమే నమోదైంది.
![వాతావరణం అనుకూలిస్తే ఈ నెలాఖరుకు సాగు](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-3900568-600-3900568-1563657652437.jpg)
పంటలపై సమీక్ష
వాతావరణం అనుకూలిస్తే జులై చివరినాటికి పంటల సాగు
ఇది కూడా చదవండి