ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

లక్ష కడితే రూ. 5వేలు వడ్డీ అంటూ మోసం.. రైల్వే ఉద్యోగి అరెస్ట్ - వెంకటగిరిలో రైల్వే ఉద్యోగీ మోసం వార్తలు

అతడొక రైల్వే ఉద్యోగి.. డబ్బు మీద ఆశతో మోసగాడిగా మారాడు. కేంద్ర ప్రభుత్వ పథకం ఒకటుందని.. అందులో లక్ష రూపాయలు కడితే నెలకు రూ. 5వేలు వడ్డీ వస్తుందని ప్రజల్ని నమ్మించాడు. తీరా డబ్బులు కట్టించుకుని ఇప్పుడు వడ్డీలివ్వకుండా చేతులెత్తేశాడు.

railway-employee-cheating-and-arrest-in-venkatagiri-kurnool-district
రైల్వే ఉద్యోగి

By

Published : Jul 1, 2020, 12:54 PM IST

కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మండలం వెంకటగిరికి చెందిన ఉరుకుందు రైల్వేలో ట్రాక్​మెన్​గా పనిచేస్తున్నాడు. డబ్బులు మీద ఆశతో దొంగదారిలో సంపాదిద్దాం అనుకున్నాడు. కేంద్ర ప్రభుత్వ పథకం ఒకటుందని.. అందులో లక్ష రూపాయలు కడితే నెలకు రూ. 5 వేలు వడ్డీ వస్తుందని నమ్మబలికాడు. తన ఊర్లోని బంధువులు, స్నేహితులతో దాదాపు రూ. 36 లక్షల వరకు వసూలు చేశాడు.

మొదట్లో సక్రమంగానే వడ్డీ చెల్లించాడు. గత కొన్ని నెలలుగా వడ్డీలు ఇవ్వకపోవటంతో గ్రామస్థులు అతన్ని నిలదీశారు. పథకం ఏమీ లేదని తాను ఇప్పుడు డబ్బులు కట్టలేనంటూ చేతులెత్తేశాడు. మోసపోయిన బాధితులు పోలీసులను ఆశ్రయించారు. వారు రైల్వే ఉద్యోగిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details